రఘురామకృష్ణ రాజు సంచలన ప్రకటన
త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామకృష్ణ
YSRCP MP Raghurama Krishnam Raju
న్యూఢిల్లీ : త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైస్సార్సీపీ అసంతృప్త నేత రఘురామకృష్ణ రాజు ప్రకటన చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని చెప్పారు. తనను వైస్సార్సీపీ నుంచి తొలగించాలని ప్రయత్నించినా ఆ పార్టీ నేతల ప్రయత్నాలు సాధ్యం కాలేదని చెప్పారు. ఏపీకి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/