పద్ధతి మార్చుకోవాలంటూ వైస్సార్సీపీ నేతలకు పవన్ వార్నింగ్..

వైస్సార్సీపీ నేతలకు వారి అనుచరులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి ఫోన్లు చేసి.. మర్యాదలకు భంగం వాటిల్లేలా ఆసభ్యకరంగా మాట్లాడడం తో పవన్ కళ్యాణ్ అగ్రం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను కించపరిచే విధంగా మాట్లడితే.. బలంగా సమాధానం ఇస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆడ బిడ్డలకు అర్ధరాత్రి ఫోన్లు చేసి.. ఆసభ్యంగా మాట్లాడటం తగదన్నారు.

ఇప్పటికైనా మాజీ మంత్రి అనుచరులు తమ పద్ధతి మార్చుకోవాలని.. లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలపగా… ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపాటి అరుణకు ఫోన్‌ చేసి.. ధైర్యంగా ఉండాలన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.