వైసిపి నేతలు పిరికి పిల్లులు అంటూ నారాలోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మరోసారి వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కుప్పం పర్యటనలో లోకేష్ మాట్లాడుతూ..అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని.. రాష్ట్ర ప్రజలపై ఇది లాఠీ ఛార్జ్…అని పేర్కొన్నారు. పోలీసులు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్ లో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

త్వరలో ప్రజా ఉద్యమం రానుంది అందులో గాలిగాడు జగన్ కొట్టుకు పోతాడని హెచ్చరించారు. 2024లో టిడిపి విజయం ఖాయమనీ.. దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సాక్షి జీతగాడు అడ్డగోలు సలహాలు ఇస్తున్నాడని.. డిజిపికి చట్టం తెలుసా….? అని ప్రశ్నించారు. కోర్టు చెప్పినా ప్రచారం ఎందుకు చేయనివ్వరని.. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టామనీ హెచ్చరించారు.