విజయసాయి ని చంద్రబాబు ఓదార్చడం ఫై బండ్ల గణేష్ సెటైర్లు

గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులపాటు మృతువు తో పోరాడి చివరకు ప్రాణాలు వదిలాడు నందమూరి తారకరత్న. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ లోనే కాదు సినీ , రాజకీయ రంగంలో కూడా విషాదం నెలకొంది. ఆదివారం తారకరత్న భౌతికాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని తన నివాసానికి తరలించారు. దీంతో తారకరత్న ను కడసారి చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

తారకరత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు దంపతులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించి , కటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని చంద్రబాబు పలకరించారు. తారకరత్న ట్రీట్ మెంట్ గురించి విజయసాయిరెడ్డి చంద్రబాబుకు వివరించారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఇక దీనిపై బండ్ల గణేష్‌ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయి, ట్వీట్‌ చేశారు. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం అన్నారు బండ్ల గణేష్‌. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలన్నారు.