బిగ్ బాస్ 5 : రెండో వారం నామినేషన్ ప్రక్రియలో రెచ్చిపోయిన శ్వేత వర్మ

బిగ్ బాస్ 5 : రెండో వారం నామినేషన్ ప్రక్రియలో రెచ్చిపోయిన శ్వేత వర్మ

బిగ్ బాస్ 5 సీజన్ సక్సెస్ ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 19 మంది సభ్యులు హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా..మొదటి వారం సరియు ఎలిమినేషన్ అయ్యింది. ప్రతీవారం వీకెండ్ షోలో ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం, మళ్లీ వారం మొదలవ్వగానే నామినేషన్ ప్రక్రియ మొదలు కావడం జరుగుతుంది. సోమవారం నామినేషన్ ప్రక్రియ ఫైర్ ఫైర్ గా జరిగినట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

రెండో వారం నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్ సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ఎర్ర రంగు పూస్తూ నామినేట్ చేయాలనీ సూచించారు. నామినేషన్ సమయంలో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డట్టు కనిపిస్తోంది. నామినేషన్ లో రవి, లోబో మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక శ్వేతా వర్మ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇంటి సభ్యులందర్నీ పాయింట్ అవుట్ చేస్తూ మహాకాళి అవతారమెత్తింది. శ్వేతా వర్మ చేసిన రచ్చకు ఇంటి సభ్యులు దారుణంగా హర్ట్ అయినట్టు కనిపించింది. అయితే ఓ దశలో హమీదాపై దురుసుగా ప్రవర్తించింది. అయితే చాలా గట్టిగా హమీదా ముఖంపై రంగు కొట్టడం అందర్నీ షాక్ గురిచేసింది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. శ్వేత వర్మ ఓ షాక్‌లో ఉన్నట్టు కనిపించింది.

గత వారంలో ప్రియాంక సింగ్, ఉమా దేవీ మధ్య ఎంతటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. షట్ అప్ అంటూ ఉమాదేవీని ప్రియాంక సింగ్ దారుణంగా అవమానించింది. చివరకు వచ్చి క్షమాపణలు చెప్పింది. అయితే ఈ సారి మళ్లీ ప్రియాంక నోరు జారినట్టు కనిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఉమా దేవీ అందరికీ ఇచ్చిపడేసినట్టుంది. యానీ మాస్టర్, ప్రియాంక సింగ్‌లను ఏదో అన్నట్టు కనిపిస్తోంది. నాతో మాట్లాడాలంటే భయంగా ఉందా? అంటూ ఉమా దేవీ కాస్త ఎక్కువగానే మాట్లాడేసింది. అది భయం కాదు.. గౌరవం అంటూ యానీ మాస్టర్ అనేసింది. సరే పోవే అని ప్రియాంక అనడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక తనను అంత మాట అనడంతో ఉమా దేవీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

నామినేట్ అయిన వారిలో కార్తీకదీపం ఫేమ్ ఉమ, ప్రియ, అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, లోబో, ఆర్జే కాజల్ నామినేట్ అయ్యారు. దీంతో వచ్చే వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది.

Nominations lo fire chala gattiga undi 🔥 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/rtXHSEsmWV— starmaa (@StarMaa) September 13, 2021