పవన్ కల్యాణ్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న బండ్ల గణేష్

పవన్ కల్యాణ్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నిర్మాత కామ్ నటుడు బండ్ల గణేష్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైక్ అందుకునే చాలు అది సినిమా ఫంక్షనా..పబ్లిక్ ఫంక్షన్ అని చూడడు పవన్ కళ్యాణ్ గురించి ఏ రేంజ్ లో స్పీచ్ ఇస్తాడు. అందుకే ఏదైనా సినిమా ఫంక్షన్ కు బండ్ల గణేష్ వచ్చాడంటే ఆయన స్పీచ్ గురించే అభిమానులంతా ఎదురుచూస్తుంటారు. కేవలం అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం గణేష్ స్పీచ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి గణేష్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఫై తనకున్న ప్రేమను చాటుకుంటూ వస్తుంటాడు.

తాజాగా మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. ఈ మధ్య పవన్ గురించి వరుస ట్వీట్స్ గణేష్ చేస్తుండడం తో చాలామంది పవన్ సినిమా ఛాన్స్ కోసమే ఇలా ట్వీట్స్ పెడుతున్నాడని కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్ గణేష్ కు ఎక్కడో కాలెలా చేసాయి, అంతే ఒక్కసారిగా పవన్ ఫై అభిమానాన్ని బయటపెట్టాడు. సినిమా తీసినా తీయకపోయినా పవన్ కల్యాణ్ వెంట తిరుగుతాను. పవన్ తో తిరగడానికి, సినిమా తీయడానికి సంబంధం లేదు. దేవుడు వరమిచ్చినా ఇవ్వకపోయినా గుడికి వెళ్తాం. నేను కూడా అంతే. పవన్ దగ్గరకు వెళ్తుంటాను. ఆయనతో సినిమా తీస్తానా తీయనా అనేది తర్వాత విషయం” అని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం గణేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పనిలో బిజీ గా ఉన్నాడు.