‘భళా తందనాన’ ప్రారంభం

డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో హీరో శ్రీవిష్ణు

Bhala Thandanana Launch
Bhala Thandanana Launch


ప్రతిసారి వైవిధ్యమైన స్క్రిప్టు, క్యారెక్టర్‌తో ఇంప్రెస్‌ చేసే కొద్దిమంది టాలీవుడ్‌ నటుల్లో శ్రీ విష్ణు ఒకరు.. ఎపుడూ వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ ఉంటారని పేరు పొందిన ఆయన మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో మన ముందుకు రానున్నారు..

‘బాణం’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమై అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్న చైతన్య దంతూరి ఇపుడు మరో సూపర్బ్‌ స్క్రిప్టుతో ఇదివరకు ఎన్నడూ చేయని రీతిలో శ్రీవిష్ణును ప్రెజెంట్‌ చేయటానికి రెడీ అవుతున్నారు.. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వారిహి చలనచిత్రం నిర్మించే ఈచిత్రానికి ‘భళా తందనాన అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు..

మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈచిత్రం ప్రారంభమైంది. తొలిసన్నివేశానికిన ప్రముఖ రచయిత శ్రీశైలం దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ క్లాప్‌ ఇచ్చారు.. ఎస్‌ఎస్‌ రాజమౌళి కెమెరా స్విచ్చాన్‌చేశారు..

స్క్రిప్టును కీరవాణి సతీమణి శ్రీవల్లి ,రాజమౌళి సతీమణి రమ సంయుక్తంగా అందించారు.. హీరో నారా రోహిత్‌, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది పాల్గొన్నారు. శ్రీవిష్ణు సరసన తొలిసారిగా కేథరిన్‌ థ్రెస్సా నటిస్తోంది.. మార్చిలోరెగ్యులర్‌ షూటింగ్‌తో మొదలవుతుందని తెలిపారు. ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/