ఇంటింటికి స్టిక్కర్ల కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైస్సార్సీపీ vs జనసేన గా మారింది. ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తుంది జనసేన పార్టీ. ఇక సోషల్ మీడియా లో అయితే చెప్పాల్సిన పనిలేదు. జనసైనికులు ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వైస్సార్సీపీ నేతలపై వరుస ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటె తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఇంటింటికి స్టిక్కర్ల కార్యక్రమంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సీఎం జగన్ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని, తన ప్రచారం కోసం ఇంటింటికి స్టిక్కర్లు అంటించాలని, మొబైల్ స్పై సీఎం జగన్ ఫోటోలు వేయాలని ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జగన్ కు ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదని.. అందుకే వారికి ముందుగా పచ్చబొట్లు వేయించి ప్రజల్లోకి పంపించాలని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి కానీ.. అవి వదిలేసి ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తామంటే ఎలా అంటూ ప్రశ్నించారు.