నా ఫేవరెట్‌ స్టార్‌ ప్రభాస్‌.. శ్రేయాస్‌

అభిమానులతో చిట్‌చాట్‌లో వెల్లడి

sreyas iyyar
sreyas iyyar

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రస్తుతం అన్ని క్రీడా టోర్నీలు రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆటగాళ్లందరూ ఖాళీగా ఉన్నారు. ఈ సందర్బంగా శ్రేయాస్‌ అయ్యార్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేశాడు. ఈ సందర్బంగా దక్షిణాది లో ఇష్టమైన స్టార్‌ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్‌ తన ఫేవరెట్‌స్టార్‌ అని బదులిచ్చాడు. కాగా ప్రభాస్‌ బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌ కు ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. ఇపుడు అందులోకి టిమిండియా యువ క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యార్‌ కూడా చేరిపోయాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana