బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా

Chetan Sharma resigns as BCCI’s chairman of selection committee

ముంబయిః బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా చేశారు. భారత క్రికెటర్ల గురించి ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో తనపై వేటు తప్పదని భావించిన చేతన్ శర్మ..బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను బీసీసీఐ కార్యదర్శి జైషాకు పంపించగా..ఆయన వెంటనే ఆమోదించారు.

కాగా, ఇటివల చేతన్‌ శర్మఓ ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో వివావాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, కెప్టెన్ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీల గురించి పలు విషయాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ, కోహ్లీల మధ్య ఇగో ఉందన్నాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసి బీసీసీఐపై పైచేయి సాధించాలని కోహ్లీ భావించినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో గంగూలీ, కోహ్లీ మధ్య గ్యాప్‌ ఏర్పడిందన్నాడు. అంతేకాకుండా భారత ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ ప్రూవ్‌ చేసుకునేందుకు ఇంజెక్షన్లు వాడుతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇంజెక్షన్లు వాడినా డోపింగ్‌ టెస్ట్‌లో దొరకవని చెప్పాడు.