కివీస్‌కు 348 లక్ష్యాన్నిచ్చిన టీమిండియా

KL Rahul and Shreyas Iyer
KL Rahul and Shreyas Iyer

హామిల్టన్‌: భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 347 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌ అంతగా ప్రదర్శన కన్పించకపోయినా తర్వాత వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అర్థ సెంచరీతో అందరినీ అలరించాడు. కోహ్లీ 63 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత సోథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ చెలరేగాడనే చెప్పాలి. అతడు 107 బంతుల్లో 103 పరుగులు సాధించి, శతకం పూర్తి చేశాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ 64 బంతులు ఆడి 88 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన కేదార్‌ జాదవ్‌ 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మొత్తంగా టీమిండియా కివీస్‌ ఆటగాళ్లకు 348 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/