రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం: తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్లాట్లు ఇతర ఆస్తుల అమ్మకం పై కమిటీ విధివిధానాలను ఖరారు చేయనుంది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండేలా ఇళ్లను నిర్మించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే నిధుల సేకరణలో భాగంగా మధ్యలోనే నిలిచిపోయిన రాజీవ్ స్వగృహ ఆస్తులను విక్రయించేందుకు మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/