క్వారంటైన్ లోకి ముస్లిం ఉలేమాల తరలింపు

రంగంలోకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్

Isolation Ward

New Delhi: నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్న ముస్లిం ఉలేమాలను క్వారంటైన్ లో ఉంచేందుకు ఆసుపత్రికి తరలిస్తున్నారు.

తొలుత క్వారంటైన్ కు తరలేందుకు వారు నిరాకరించడంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ రంగంలోనికి దిగారు. 

విదేశీయులతో పాటు పలువురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నిజాముద్దీన్ ప్రాంతంలోని బంగ్లేవాలీ మసీదులో ఉన్నారు.

వారిని ఆసుపత్రికి తరలించేందుకు అజిత్ డోబాల్ ముస్లిమ్ ఉలేమాలతో చర్చించి వారిని ఒప్పించారు.

మసీదులోని వారందరికీ పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తరలించి, వైరస్ ప్రబలకుండా మసీదును శుభ్రపర్చారు.

మొత్తంమీద 2300 మందిని మర్కజ్ నుంచి భద్రతాధికారులు ఖాళీ చేయించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/