కేటీఆర్‌తో మహారాష్ట్ర మాజీ మంత్రి అదిత్య ఠాక్రే భేటీ

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తో మహారాష్ట్ర మాజీ మంత్రి అదిత్య ఠాక్రే భేటీ అయ్యారు. మంగళవారం హైద‌రాబాద్‌లోని టీహ‌బ్‌ను అదిత్య ఠాక్రే సంద‌ర్శించారు. ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్‌తో ఆయ‌న చ‌ర్చ‌లు నిర్వ‌హించారు.

ఈ నేప‌థ్యంలో త‌న ట్విట్ట‌ర్‌లో ఆదిత్య థాక‌రే స్పందిస్తూ.. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన ప్ర‌తిసారి అద్భుతంగా, ఎంక‌రేజింగ్ ఫీల‌వుతాన‌ని అన్నారు. సుస్థిర‌త‌, ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, సాంకేతిక‌త లాంటి అంశాల‌పై ఇద్ద‌రం చ‌ర్చించుకున్నామ‌ని, భార‌త దేశ ప్ర‌గ‌తిలో ఆ అంశాలు కీల‌క‌మైనవ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించుకున్న‌ట్లు ఆదిత్య థాక‌రే తెలిపారు. టీహ‌బ్‌ లో జ‌రిగిన వ‌ర్క్ గురించి ఆదిత్య థాక‌రే స్ట‌న్ అయ్యారు. టీహ‌బ్ మ‌హాద్భుతంగా ఉంద‌న్నారు. స్టార్ట్ అప్‌లు, ఆవిష్క‌ర్త‌లు, ఆలోచ‌నాప‌రుల‌కు టీహ‌బ్ మంచి ఊతం ఇస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.