దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా పిఎన్‌బీ

పిఎన్‌బీలో విలీనమయిన ఓరియంటల్‌ బ్యాంకు, యునైటెడ్‌ బ్యాంకు

punjab national bank
punjab national bank

దిల్లీ: దేశంలో నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరిగింది. దీంతో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అవతరించింది. పీఎన్‌బీ లో ఓరియంటల్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,విలీనం అయ్యాయి. నేటి నుంచి ఈ బ్యాంకుల బ్రాంచులన్ని పిఎన్‌బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ఈ విలీనంతో 11 వేలకు పైగా బ్రాంచులు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్షమంది ఉద్యోగులతో పిఎన్‌బీ రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. నేటి ఈ విలీనంతో పిఎన్‌బీ వ్యాపార కార్యకలాపాలు 18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/