యూరప్ లో కరోనా మృతుల సంఖ్య 30వేలు

4,58,601 కరోనా పాజిటివ్‌ కేసులు

Europe

యూరప్ లో క రోనా మృతుల సంఖ్య 30వేలు దాటింది. ఇప్పటి వరకూ  ఇటలీలో వేగంగా విజృంభించిన ఈ మహమ్మారి ఇప్పుడు స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో కూడా వేగంగా  విస్తరిస్తోంది.

బుధవారం మధ్యాహ్నం వరకు యూరప్‌లో 4,58,601 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అందులో 30,063 మంది మరణించారు.

ఇటలీలో అత్యధికంగా 12,428 మంది కరోనా కారణంగా చనిపోయారు. స్పెయిన్‌లో మృతుల సంఖ్య 8,189కి చేరగా.. ఫ్రాన్స్‌లో 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో మంగళవారం ఒక్కరోజే 499 మంది కరోనా కారణంగా చనిపోయారు.   

జర్మనీలో కొత్తగా 5,453 కేసులు నమోదు కాగా..149 మంది మృత్యువాత పడ్డారు.

జర్మనీలో కరోనా సోకిన వారి సంఖ్య 67,366 చేరగా.. మృతుల సంఖ్య 732కు చేరుకుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/