తెలుగుదేశం పార్టీకి ముస్లిం పర్సనల్ లా బోర్డు మద్దతు

Muslim Personal Law Board supports Telugu Desam Party

అమరావతిః టీడీపీ అధినేత చంద్రబాబును సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఈరోజు ఆయన నివాసంలో కలిశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సంస్థ అధ్యక్షుడు రషీద్ షరీఫ్ మాట్లాడుతూ.. చంద్రబాబు లౌకికవాదానికి ఐకాన్ లాంటి వాడని అభివర్ణించారు. మత సామరస్యాన్ని కాపాడడంలో టీడీపీ ముందుంటుందని కొనియాడారు. చంద్రబాబు సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారని అన్నారు.

ఎన్డీయే కూటమి మేనిఫెస్టో మైనారిటీల అభ్యున్నతికి దోహదపడుతుందని భావిస్తున్నామని రషీద్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. ముస్లింల అభివృద్ధికి తోడ్పడే మేనిఫెస్టో పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.