ఏపి గవర్నర్‌కు కరోనా పరీక్షలు

ఏపి రాజ్‌ భవన్‌లో నలుగురు ఉద్యోగులకు కరోనా

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపి రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తెలింది. గవర్నర్ కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులను నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు, మెడికల్ స్టాఫ్ (ఓ నర్స్), ఓ బట్లర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కూడా వైరస్ సోకిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగం వెల్లడించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన గవర్నర్ ప్రధాన భద్రతా అధికారి కొన్ని వారాల క్రితం హైదరాబాదుకు వెళ్లివచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాజ్ భవన్ లో 12 మంది మెడికల్ టీమ్ పనిచేస్తున్నామని, లాక్ డౌన్ మొదలైన తర్వాత తమని ఎవర్నీ బయటకు వెళ్లడానికి అనుమతించలేదని పేర్కొన్నారు. కాగా, వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/