విడాకులు తీసుకోపోతున్న మరో సినీ జంట

చిత్రసీమలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..అంతే త్వరగా విడిపోవడం కామన్. ఇప్పటివరకు చిత్రసీమలో ఎంతోమంది పెళ్లి చేసుకొని..ఆ తర్వాత విడాకులు తీసుకొని , రెండో పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ క్రేజీ జంట నాగ చైతన్య , సమంత లు విడాకులు తీసుకొని అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట..తమ అభిరుచి మేరకు విడాకులు తీసుకొని వారి వారి సినిమాల్లో బిజీ గా ఉన్నారు. తాజాగా మరో సినీ జంట తమ 13 వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

కోలివుడ్‌ స్టార్‌ మూజిక్‌ డైరెక్టర్‌ డి.ఇమ్మాన్‌ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్‌ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ జంట 2020లోనే విడాకులు తీసుకుంది. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. దాదాపు ఏడాది తర్వాత సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు ఇమ్మాన్‌. ‘నా శ్రేయోభిలాషులకు, సంగీత ప్రియులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహన, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టాడు ఇమ్మాన్‌. ఈ పోస్ట్ చూసి సినీ ప్రముఖులే కాదు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.