తమిళంవైపు చూపు

డింపుల్‌ హయతి ఆనందం

Dimple Hayati
Dimple Hayati

టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌.. డింపుల్‌ హయతి.. ఈ బ్యూటీ 2017లో గల్ఫ్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. ఆ సినిమాకు మంచి పేరొచ్చింది..

ఈ తర్వాత యురేకా సినిమాలో ఓ క్యారెక్టర్‌ ప్లే చేసింది. గత ఏడాది హరీష్‌శంకర్‌ రూపొందించిన గద్దలకొండ గణేష్‌ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.

తాజాగా ఇపుడు కోలీవుడ్‌ వైపు అడుగువేస్తుంది..

తమిళం నుండైతే మంచి ఆఫర్లు వస్తాయంటూ ఆనందం వ్యక్తంచేస్తోంది.. ఈ భామ తాజాగా మాట్లాడుతూ, గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారని, అలా అని గ్లామర్‌ రోల్స్‌ చేయనవి కాదు అన్నారు.

భాషాబేధం లేకుండా సినిమాలు చేస్తానని చెప్పకనే చెబుతోంది..

ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల మూవీలో నటిస్తూ, తమిళ కథలు వింటోందని తెలిసింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/