మళ్లీ బిజెపిలోకి రాజగోపాల్ రెడ్డి..? మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు

రీసెంట్ గా బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..తిరిగి బిజెపి లో చేరతారని తెలిపి షాక్ ఇచ్చారు బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేసిన మురళీధర్.. బండి సంజయ్ సీఎం రేస్ లో ఉన్నాడని ..అందుకే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని వివరించారు. అలాగే సీఎం రేస్ లో కిషన్ రెడ్డి లేడని అందుకే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని స్పష్టం చేసారు.

తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలో వస్తుందని మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు మరికొన్ని వారాలే మిగిలి ఉన్న ఈ సమయంలో మురళీధర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కేడర్ లో విశ్వాసం నింపేందుకు, బండి సంజయ్ తొలగింపుతో ఆయన అభిమానుల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించేందుకే మురళీధర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా నిజంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న కోణంలో అంత మాట్లాడుకుంటున్నారు.