మునుగోడు ఉపఎన్నిక.. భారీ మొత్తంలో పట్టుబడిన డబ్బు

seized currency
seized currency

మునుగోడుః మునుగోడు ఉపఎన్నికకు నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. మునుగోడు మండలం గూడపూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గూడపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద పోలీసులు డబ్బును గుర్తించారు. దానికి సంబంధించిన పత్రాలను అతడు చూపించకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని సీజ్‌చేశారు.

మరికాసేపట్లో మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుంది. ఈనెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. అక్టోబర్‌ 15న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/