గుడ్లు, మాంసంతో కరోనా రాదు
కరోనా వ్యాప్తిపై వదంతులు

New Delhi: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తికి సంబంధించి పలు వదంతులు ప్రాచారంలో ఉన్నాయి.
వాటిలో ప్రధానంగా మాంసం తింటే కరోనా వైరస్ సోకుతుందనీ, అలాగే గుడ్లు తినే వారు కరోనా బారిన పడేందుకు ఆస్కారం ఎక్కువ ఉందన్న వదంతులు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా మాంసం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.
ఈ నేపథ్యంలో మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. సాధారణ ఆరోగ్య సంరక్షణకు ముందు జాగ్రత్తగా, అన్ని రకాల మాంసాలను బాగా కడిగి, సరిగ్గా ఉడికిస్తే సరిపోతుందని వివరించారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.