దేశంలో కొత్తగా 1997 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గిపోయాయి. రోజువారీ కేసులు 2 వేల దిగువకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 1997 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,46,06,460కి పెరిగాయి. ఇందులో 4,40,47,344 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,754 మంది మహమ్మారితో మృతిచెందారు. మరో 30,362 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు ఆరుగురు వైరస్‌కు బలవగా, 3908 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/