ఒక చెల్లెలుగా ఆర్కేను అర్థం చేసుకుంటాః వైఎస్‌ షర్మిల

YS Sharmila

అమరావతిః ఎమ్మెల్యే పదవికి, వైఎస్‌ఆర్‌సిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి… రోజుల వ్యవధిలోనే మళ్లీ సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన మళ్లీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ఈ నేపథ్యంలో, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు సొంత మనిషని చెప్పారు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఒక చెల్లెలుగా ఆర్కేను అర్థం చేసుకుంటానని… ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని అన్నారు. తనకు, ఆర్కేకు మధ్య రాజకీయాలు లేవని అన్నారు.