శ్రీరామ నామంతో మారుమోగిపోతున్న ముఖేష్ అంబానీ నివాసం

దేశం వ్యాప్తంగా ఇప్పుడు వినిపించే పదం జై శ్రీరామ్..జై శ్రీరామ్. ఏనోట విన్న..ఎక్కడ చూసిన అంత రామస్మరణ తో మారుమోగిపోతుంది. మరికాసేపట్లో అయోధ్య లో రామ మందిరం ప్రారంభం కాబోతుండడం తో దేశ వ్యాప్తంగా ప్రజలు , భక్తులే కాదు అనేక రంగాల వారు శ్రీరామ నామం జపం చేస్తూ..పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇల్లు ‘యాంటిలియా’కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరాముని ప్రతిష్ఠాపనకు ముందు ‘యాంటిలియా’ పెళ్లికూతురులా అలంకరించబడిందని చూడవచ్చు. రామనామంతో ‘యాంటిలియా’ అలంకరించబడింది. అలంకరణలు చూస్తుంటే దీపావళి పండగలా అనిపిస్తోంది.