మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

అహ్మదాబాద్: సమాజంలో పాలకులపై అసంతృప్తి పెరుగుతోందని, ఇదే సమయంలో హింసా కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని, దీంతో మూడో ప్రపంచ యుద్ధానికి సమయం వచ్చిందేమోనని తనకు అనిపిస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం కుగ్రామమైంది. కానీ ఇప్పుడు మోడో యుద్ధ భయం వెన్నాడుతోంది. ఇది మరోరకంగా మన ముందుకు రాబోతోంది. యజమానులు, కార్మికులు, ప్రపభుత్వ ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు… ఇలా ప్రతి ఒక్కరూ నిరసనలకు దిగుతున్నారుఖి అని అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నిరసనలు ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారని చెప్పకనే చెబుతున్నాయని అభిప్రాయపడ్డ మోహన్ భగవత్, మిల్లు ఓనర్లు, కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ఎవరిలోనూ సంతోషం లేదని తెలిపారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో నివశిస్తున్న వారిలో అసంతృప్తి తాండవిస్తోందని అన్నారు. 100 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులతో ఇప్పటి పరిస్థితులను పోల్చుకోండి? పానిపట్ యుద్ధంలో ఎవరు గెలిచారు? మరాఠాలు గెలిచారా? ఓడారా? ఎవరు చనిపోయారు? ఈ వార్త పూనాకు చేరేవరకు నెల రోజుల సమయం పట్టింది. ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/