వైస్సార్సీపీ కి షాక్ ఇచ్చిన ముద్రగడ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇంచార్జ్ లను మారుస్తుండడం తో చాలామంది నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ , జనసేన లలో చేరగా..కొత్తగా చేరిన వారు సైతం పట్టుమని పది రోజులు గడవకముందే రాజీనామా చేస్తున్నారు. తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైతం జగన్ కు షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు ఈయన వైసీపీ లో చేరతారని అంత భావించారు. కానీ ముద్రగడ మాత్రం వైసీపీ లో చేరేది లేదని స్పష్టం చేసారు.

టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని.. లేకపోతే ఇంట్లోనే కూర్చుంటానని తెలిపారు. మా ఇంటికి వచ్చి సమయం వృథా చేసుకోవద్దని వైసీపీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. కాపు ఉద్యమనేతగా గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం ఇటీవలే తాను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతానంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ముద్రగడ ఏ పార్టీలోకి వెళ్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ముద్రగడతో టీడీపీ, జనసేన నేతలు వరుసగా భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన జనసేన పార్టీలోకి చేరుతారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలోనే ముద్రగడ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవనున్నట్లు సమాచారం.