తెలంగాణ దశా-దిశ మార్చడంలో ఎంఎస్‌ఎంఈ కీలకపాత్ర

ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లే పరిస్థితి మారాలి

k laxman
k laxman

హైదరాబాద్‌: ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఒక జిల్లా-ఒక ఉత్పత్తిపై సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ దశా దిశ మార్చడంలో ఎంఎస్‌ఎంఈ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి మారాలన్నారు. పెందుర్తి, నిర్మల్‌ తాండూరు, ఖమ్మం, సిరిసిల్ల, గద్వాలలో ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులకు అనేక అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదని విమర్శించారు. పదిమంది కలిసి క్లస్టర్‌గా ఏర్పాడి చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవలన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/