‘విజయనిర్మల విగ్రహావిష్కరణ’

సభలో భావోద్వేగానికి గురైన మహేశ్‌ బాబు

VijayaNirmala-statue
VijayaNirmala-statue

హైదరాబాద్‌: ప్రముఖ సినినటి, దర్శకురాలు విజయనిర్మల (74)వ జయంతి సందర్భంగా హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడాలోని కృష్ణ, విజయ నిర్మల నివాసంలో.. విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయనిర్మల స్త్రీ శక్తి అవార్డును దర్శకురాలు నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘విజయ నిర్మల గారు చాలా గొప్ప వ్యక్తి. నా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో మార్నింగ్‌ షో చూసి నాన్నగారు ఫోన్‌ చేసి మాట్లాడేవారు. తర్వాత ఆవిడ మాట్లాడేది.. శుభాకాంక్షలు తెలిపేది. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యాక నాన్న గారు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతుందని నేను అనుకున్నాను.. అయితే, ఆమె చనిపోయిందన్న విషయం తర్వాత గుర్తుకొచ్చింది’ అంటూ మహేశ్‌ బాబు బాధపడ్డారు. ఆమె లేని లోటు తనకు గుర్తుకొచ్చిందని చెప్పారు. ఆమె ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, సీనియర్ నటులు కృష్ణ, కృష్ణం రాజు, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నరేశ్‌లతో పాటు ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/