దుబాయ్‌ ఓపెన్‌లో ఓడిన సానియా జోడి

Sania Mirza
Sania Mirza

దుబాయ్‌: దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ లో సానియా మీర్జా జోడి పరాజయం పాలైంది. దీంతో ఈ జోడి టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో సానియా మీర్జా (భారత్‌)కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) ద్వయం 4-6, 2-6తో సాయ్‌సాయ్‌ జెంగ్‌ (చైనా)బార్బరా క్రెజిసికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. సానియా జోడి వరుస సెట్లలో పరాజయం పాలై దుబాయ్‌ ఓపెన్‌ నుండి నిష్క్రమించింది. అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జాకరోలినా గార్సియా ద్వయం 6-4, 4-6, 10-8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో అలా కుద్రయెత్సెవా (రష్యా)కాటరీనా స్రెబోత్నిక్‌ (స్లొవేనియా) జంటను ఓడించింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న మార్సెలీ ఓపెన్‌ ఏటీపీ250 టోర్నీలో పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)షపోవలోవ్‌ (కెనడా) జోడి 5-7, 7-6 (7/3), 8-10తో నీల్సెన్‌ (డెన్మార్క్‌)టిమ్‌ పుయెట్జ్‌ (జర్మనీ) ద్వయం చేతిలో పరాజయంపాలైంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/