విశాఖ భూ ఆక్రమణలపై మాట్లాడితే బెజవాడ కరకట్ట కొంపలో భూకంపం
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెదేపా అధినేత చంద్ర బాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘అమరావతి పేరుతో దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లంతా బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతికి మద్దతివ్వాలట! ఎల్లో మీడియా ఆ పనిలో పడింది. రాజధాని పేరుతో లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిన బాబుకు కిరాయి ఉద్యమాన్ని ఎటు తీసుకుపోవాలో అంతుబట్టడం లేదు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
విశాఖకు చెందిన టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ పై కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ‘టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఒకేచోట 56 ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశాడని తేలింది. పచ్చ గెద్దలు విశాఖలో భూముల్ని, కొండల్ని, కాలువల్ని, గెడ్డల్ని ఎలా తన్నుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. విశాఖ భూ ఆక్రమణలపై మాట్లాడితే బెజవాడ కరకట్ట కొంపలో భూకంపం వస్తోంది. ఈ లింకేంటో త్వరలోనే తేలుతుంది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/