తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పై ‘ఈటల’ విమర్శలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

TS Minister Srinivas Goud Vs Etala
TS Minister Srinivas Goud Vs Etala

Hyderabad: మాజీ మంత్రి ఈటల పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కు , ఈటెలకు ఆరేళ్లుగా గ్యాప్ ఉంటే మంత్రి పదవి ఎలా వచ్చింది? అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈటల అయన తాను చేసి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల బీజేపీలో ఎందుకు చేరుతున్నారని చెప్పాలని అన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పార్టీ, కేసీఆర్ లేకుండా ఈటల పేరుమీద గెలిచారా? అని నిలదీశారు. హుజురాబాద్ లో అభివృద్ధి చేసే పార్టీకి అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు పోటీ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో బీజేపీ భూ స్థాపితం అవుతుందని అన్న ఈటల.. ఇపుడు ఎందుకు బీజేపీలో చేరుతున్నారని ప్రశ్నించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/