సెన్సెక్స్‌, నిఫ్టీల శతకం

లాభాలతోముగిసిన ఈక్విటీలు

BSE
BSE

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ చివరికి 214 పాయింట్లు జమ చేసుకొని 38,435వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కూడా 59పాయింట్లు పెరిగి 11,372వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో మొదట సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది.

అదేవిధంగా నిఫ్టీ కూడా సెంచరీ చేసింది. ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 1.8శాతం పెరగ్గా, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, రియాల్టీ 1.25శాతం చొప్పున పెరిగాయి.

అయితే మీడియా, మెటల్‌, ఐటి 1.4శాతం నుంచి 0.3శాతం మధ్య నీరసించాయి.

నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టిపిసి, పవర్‌గ్రిడ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, హీరోమోటోకార్ప్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఐషర్‌, గ్రాసిమ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బిఐ, శ్రీ సిమెంట్‌, అల్ట్రాటెక్‌, టైటాన్‌ వంటి షేర్లు 5నుంచి ఒక శాతం మధ్య పెరిగాయి.

జీ, హిండాల్కో, ఎయిర్‌టెల్‌, ఒఎన్‌జిసి, టాటా స్టీల్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వంటి షేర్లు 3.7శాతం నుంచి 0.6శాతం మధ్య నీరసించాయి.

జిఎంఆర్‌ 10శాతం ర్యాలీతీయగా, పేజ్‌, బిహెచ్‌ఇఎల్‌, బాష్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఎంజిఎల్‌, అపోలోటైర్స్‌, ఫెడరల్‌ బ్యాంకు, బెర్జర్‌ పెయింట్స్‌, ఐసిఐసిఐ ఫ్రు, దివీస్‌ 7.6నుంచి 2శాతం మధ్య పెరిగాయి.

కాగా మరోపక్క జిందాల్‌ స్టీల్‌, అశోక్‌ లేలాండ్‌, నాల్కో, పివిఆర్‌, ఇండిగో, ఆర్‌ఇసి, బాలకృష్ణ, వోల్టాస్‌, కాల్గేట్‌, ఎల్‌అండ్‌టి ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌,4.2శాతం నుంచి 1.2శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు 0.6శాతం నుంచి 1.4శాతం చొప్పున పెరిగాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/