సడన్ గా లాక్ డౌన్ ఏంటి?

గ్రామాలకు వెళ్లేవారు ఎలా వెళ్తారు: ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Telangana High court
Telangana High court

Hyderabad:  తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క రోజు వ్యవధిలో లాక్ డౌన్ విధిస్తే గ్రామాల్లోకి వెళ్లేవారు ఎలా వెళతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా ఇంత సడెన్ నిర్ణయం ఏంటి ? అని నిలదీసింది. కనీసం ఈ రోజు 10 గంటల వరకు మీకు లాక్ డౌన్ ఆలోచన లేదని.. ఇప్పుడు సడెన్ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇతర ప్రాంతాల వాళ్ళు తక్కువ టైమ్ లో ఎలా వెళతారు ? అని హైకోర్టు ప్రశ్నించింది.

ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేదని.. సడెన్ గా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా ? అని హైకోర్టు నిలదీసింది. గతేడాదిలా వలస కూలీలు ఇబ్బందులు పడకుండదని హై కోర్టు హెచ్చరించింది. ఇక రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రజల్లో అయోమయం ఉందని దీనిపై ప్రజలకు స్పష్టతనివ్వాలని హైకోర్టు పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/