పోలీసు ట్విస్ట్ : గుంటూరు జిల్లా జైలుకు తరలింపు

మరికాసేపట్లో ఎంపీ రఘురామ మెడికల్ రిపోర్ట్: సర్వత్రా ఉత్కంఠ

Guntur: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో పోలీసులు మరో అడుగు ముందుకు వేసి ట్విస్ట్ ఇచ్చారు. రఘురామను జీజీహెచ్ నుంచి జిల్లా జైలుకు తరలించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఎంపీకి సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించిన విషయం విదితమే . అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఘురామ ను జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా , రఘురామ మెడికల్ రిపోర్ట్ సిద్ధమైంది. కాసేపట్లో జిల్లా మెజిస్ట్రేట్‌కు సీల్డ్ కవర్‌లో అందజేయనున్నారు. అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు జిల్లా మెజిస్ట్రేట్ అందజేయనున్నారు. మెడికల్ రిపోర్టుపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/