నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం

ఉత్తర్వులు జారీ జారీ చేసిన ఏపి ప్రభుత్వం

Telugu Talli

అమరావతి: నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజ‌ధాని, జిల్లా కేంద్రాల్లో అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి తొమ్మిది మంది అధికారుల‌తో క‌మిటీని ఏర్పాటుచేసింది.

2014, జూన్ 2న రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్ణ‌యించ‌లేదు. భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల్లో భాగంగా 1956, న‌వంబ‌ర్ 1న తెలంగాణ‌తో కూడిన‌ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి న‌వంబ‌ర్ 1న రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/