ఇసుక పాలసీని తక్షణమే మార్చాలి

సీఎం జ‌గ‌న్‌కు రఘురామకృష్ణ లేఖ‌

అమరావతి : ఎంపీ రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ కు ఈ రోజు మరో లేఖ రాశారు. ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు స‌మ‌స్య‌ల గురించి జ‌గన్‌కు వివ‌రించిన ర‌ఘురామ, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక పాలసీ గురించి ఈ రోజు తన లేఖలో ప్ర‌స్తావించారు. వైస్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఇసుక‌ బ్లాక్ మార్కెటింగ్‌ను అరిక‌ట్ట‌డం, ఇసుక ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం కోసం క‌మిటీని ఏర్పాటు చేసి, అనంత‌రం పాల‌సీ తీసుకొచ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే, ఈ పాల‌సీ వ‌ల్ల స‌మ‌స్య‌లు పెరిగిపోయాయ‌ని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీని తక్షణమే మార్చాలని, రాష్ట్రంలో అన్ని చోట్లా ఒకే ధరకు ఇసుక లభించేలా కొత్త పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జ‌గ‌న్ గారిని కోరుతున్నాను. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయి అని ర‌ఘురామ కృష్ణ‌రాజు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/