బైడెన్‌కు మోడి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : అమెరికా 245వ సాంత్రత్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు, అమెరికా పౌరులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. . ‘ గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ఇండియా, అమెరికా దేశాలు స్వేచ్ఛాస్వాంత్ర్య విలువలను కాపాడుకుంటూ వస్తున్నాయి. మ‌న రెండు దేశాల మ‌ధ్య‌ ఉన్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి ప్ర‌పంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది’ అని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా అమెరికన్లకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథోనీ బ్లింకెన్‌ను ఆయన విష్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/