పవన్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఫై ఎంపీ మార్గాని భరత్ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సెటైర్లు పేల్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ NDA సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి మీడియా వారు పవన్ కళ్యాణ్ ను పలు ప్రశ్నలు అడిగారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల ఫై , ఒకవేళ గెలిస్తే ఏపీకి సీఎం ఎవరు అవుతారు అని ఇలాంటి పలు ప్రశ్నలు అడిగారు. మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ సమాదానాలు తెలిపారు. అయితే పవన్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఫై ఎంపీ మార్గాని భరత్ సెటైర్లు వేశారు.

పవన్ మాట్లాడిన ఇంగ్లీష్ చూశాక.. ఇలా కూడా మాట్లాడవచ్చా అనిపించిందని భరత్ అన్నారు. ఏపీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని, ఆ పార్టీ వైపు ఎందుకు వెళ్లారో చెప్పాలని పవన్ ను నిలదీశారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చారా? హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చారా? ఏం చేశారని బీజేపీ వైపు వెళ్లారు? అని ప్రశ్నించారు. పవన్ ఢిల్లీకి వెళ్లి సినిమా చిందులు వేశారని భరత్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ … చిరాగ్ పాశ్వాన్ ను హగ్ చేసుకున్నారని, పవన్ ఆ వెనుక నిల్చున్నారని, ఆయన వ్యాల్యూ ఏంటో తేలిపోయిందన్నారు. ప్రతిపక్ష నాయకులు ఉండేది తెలంగాణ లో , రాజకీయాలు చేసేది ఆంధ్ర లో అంటూ చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై భరత్ కామెంట్స్ చేసారు.

భరత్ కామెంట్స్ ఫై జనసేన శ్రేణులు ఓ రేంజ్ లో కౌంటర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ ఎమ్మెల్యే కాదు , ఎంపీ కాదు కనీసం ఏ రాజకీయ పదవి లేదు. అయినప్పటికీ మోడీ పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపించారని..అది పవన్ కళ్యాణ్ రేంజ్ అని అన్నారు.