రామ్ చరణ్ కూతురికి జూ. ఎన్టీఆర్ ఏ గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..?

రామ్ చరణ్ దంపతులు జూన్ 20 న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాప కు క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు చిరంజీవి తెలుపడం జరిగింది. మానవుడిలో ఆధ్యాత్మికతను మేల్కొలిపే స్వచ్ఛమైన శక్తి పరివర్తనను క్లీంకార అనే పేరు సూచిస్తుందని చిరంజీవి వివరించారు. కాగా చరణ్ క్లీంకార కు అరుదైన గిఫ్ట్ ను ఇచ్చారు జూ. ఎన్టీఆర్.

క్లీంకార కోసం రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార ముగ్గురు పేర్లతో ఉన్న బంగారు డాలర్స్ ను డిజైన్ చేసి బహుమతిగా పంపారని తెలుస్తుంది. అయితే ఈ బహుమానాన్ని కూడా తారక్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ రామ్ లు ఎంతో ఇష్టంగా అందించినట్టు సమాచారం. క్లీంకార పుట్టినప్పటి నుండి ఫ్యాన్స్ మెగా ప్రిన్సెస్ విషయంలో తమ సంతోషాన్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త కూడా వైరల్ అవుతుంది.

ఇక ఎన్టీఆర్ – చరణ్ ల స్నేహబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసారు. ఈ సినిమా తర్వాత వీరి స్నేహబంధం మరింత పెరిగింది. వీరిద్దరూ ఎక్కడ వేదిక మీద ఉన్నా వీరి స్నేహాన్ని తెలియజేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మీరు ఇరువురి మధ్యనే కాకుండా ఇరు కుటుంబాల మధ్య కూడా ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. వీరి స్నేహం చూసి మెగా , నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు.