రైతన్నను ఆదుకోవడంలో కెసిఆర్‌ విఫలమయ్యారు

ముఖ్యమంత్రి పేద ప్రజలను పట్టించుకోవడం లేదు

komatireddy venkat reddy
komatireddy venkat reddy

భువనగిరి : తెలంగాణ రాష్ట్రంలో రైతన్నను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ విఫలమయ్యారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రైతు ఆత్మహత్యలను కెసిఆర్‌ ఆపలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకర్గంలోని కేతేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ ప్రమాణ స్వీకారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రెండు పడకల గదుల ఇళ్లు కట్టిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి కెసిఆర్‌ నెరవేర్చలేకపోయారని అన్నారు. పేద ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి తెలిపారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే..అక్రమంగా మున్సిపల్‌ ఛైర్మన్‌లను గెలుచుకున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం వల్లే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ది జరుగుతోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/