ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందిః హరీశ్‌ రావు

harish-rao

హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని జనం బాధపడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని కాంగ్రెస్ చెబుతోందని… కానీ అది అబద్ధమే అన్నారు. గృహజ్యోతి కింద కేవలం 30 లక్షల మందికే అమలు చేశారన్నారు.

రైతులు, మహిళలు, పేదలను, యువత, నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆసరా పెన్షన్లు పెంచుడు మాట ఏమో కానీ… కనీసం జనవరి నెలలో పెన్షన్లే ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని మోసం చేశారన్నారు.