‘బుల్లెట్ బండి’ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసిన ఎంపీ కవిత..సోషల్ మీడియా లో వైరల్

‘బుల్లెట్ బండి’ ఇప్పుడు ఈ పాట ఎక్కడ చూసిన మారుమోగిపోతుంది. సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఈ పాటను పాడుతూ..వేడుకల్లో అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు. తాజాగా ఇదే పాటకు ఎంపీ కవిత అదిరిపోయే డ్యాన్స్​ వేసి సోషల్ మీడియా లో వైరల్ గా మారారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నాడు జరిగిన ఓ వివాహ వేడుకలో బుల్లెట్ బండి పాటకు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత డ్యాన్స్​ చేశారు. స్టేజీపై పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, వారి కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేశారు. డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్​గా మారాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో ఈ ‘బుల్లెట్​ బండి’ పాట తెగ వైరల్​ అవుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి బరాత్​లో వధువు చేసిన డ్యాన్స్ చూసి ప్రముఖులు కూడా ఈ వీడియోను షేర్ చేసి వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.

https://youtube.com/watch?v=IB8hG1iD9m0