పవర్ స్టార్ ‘బర్త్ డే’ రోజు పవర్ ఫుల్ అప్డేట్స్ ..రికార్డ్స్ రాసుకోవడానికి సిద్దంకండి

తమ అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే అభిమానుల సంబరాలు అంత ఇంత కావు. అలాంటిది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబరు 02 ) అంటే సంబరాలు అంబరాన్ని తాకాల్సిందే. మొన్నటి వరకు ఓ లెక్క ..ఇప్పుడు ఓ లెక్క అనేలా ఉంది. ఎందుకంటే పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానుల్లో సంబరాలు నింపుతున్నారు. ఈ క్రమంలో ఆయన బర్త్ డే అంటే ఆ రోజంతా కొత్త సినిమాల తాలూకా అప్డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తాల్సిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబరు 02 న పవర్ ఫుల్ అప్డేట్స్ రానున్నాయట.

అందులో ఒకటి హరిహర వీరమల్లు మూవీ అప్డేట్ అని తెలుస్తుంది. పవన్​​ – క్రిష్​ కలయికలో తెరకెక్కుతున్న పాన్​ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏఎమ్​ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎమ్​ఎమ్​ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రం నుంచి కీలక అప్​డేట్​ రానుందని సమాచారం. మరి ఆ అప్డేట్ రిలీజ్ తేదీన లేక మరొకటా అనేది తెలియాల్సి ఉంది.

మరో అప్డేట్ భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్. మలయాళ సూపర్​హిట్​ చిత్రం ‘అయ్యప్పనుమ్​ కోషియుమ్​’ రీమేక్​గా రాబోతున్న ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుపాటి రానా నటిస్తున్నాడు. భీమ్లా నాయక్​పాత్రలో పవన్​.. డానియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఓ రేంజ్ లో వ్యూస్ సాధించి సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది. మరి బర్త్ డే రోజున రాబోతున్న ఫస్ట్ సాంగ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ రెండు అప్డేట్స్ మాత్రమేనా..హరీష్ మూవీ కి సంబంధించి ఏమైనా వస్తుందా అనేది చూడాలి.