నేటి నుండి తెలంగాణలో సినిమా థియేటర్ల ప్రారంభం

కరోనా జాగ్రత్తలతో థియేటర్లు తెరువాలి..సిఎం

Cinema hall

హైదరాబాద్‌: తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం టిఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన సిఎం కెసిఆర్‌ థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పారు. సినీ పరిశ్రమకు పలు వరాలు ఇచ్చారు. సిఎం చెప్పిన మేరకు ఆ వెంటనే థియేటర్లు తెరిచేందుకు వీలుగా జీవో కూడా జారీ అయింది. కరోనా కారణంగా దెబ్బతిన్న సినిమా పరిశ్రమను, దానిపై ఆధారపడిన40 వేలమంది కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామని సిఎం చెప్పారు. థియేటర్లు తెరిచిన తర్వాత.. కరోనా సెకండ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి 50 శాతం సీటింగ్‌తో సిఎం కెసిఆర్ అనుమతి ఇచ్చారు. సినిమా పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మాస్కులు, శానిటైజర్‌ తప్పనిసరిగా వాడాలని సూచించారు. థియేటర్లలో టెంపరేచర్ 24 నుంచి 30 మధ్య ఉండేలా చూడాలని ఆదేశించారు. థియేటర్ల యాజమాన్యాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా సిఎం కెసిఆర్ కల్పించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/