ట్రక్కు బోల్తా..17 మంది మృతి

truck accident in Nicaragua

మనాగ్వా: సెంట్రల్‌ అమెరికాలోని నికరాగ్వాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 17 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో 12 మంది మహిళలున్నారని వాస్లావా మేయర్‌ జర్మన్‌ వర్గాస్‌ తెలిపారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నికరాగ్వాలోని మోంటానిట ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ట్రక్కు వాస్లాలా పట్టణం నుంచి శాన్‌ ఆంటోనియో డెయారో ప్రాంతానికి వెళ్తుండగా వాహనం బ్రేకులు ఫెయిలవడంతో వాహనం ప్రమాదానికి గురైంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/