గంజాయికి బానిసైన కొడుకు కళ్లలో కారం కొట్టి..చితకొట్టిన తల్లి

బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్‌ వాడుతున్నట్లు బయటపడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డ్రగ్స్ ను కేవలం బడా బాబుల కుమారులే కాదు మధ్య తరగతి కుటుంబాల వరకు పాకింది. హైదరాబాద్ లో మాత్రమే కాదు మారుమూల గ్రామాల్లో కూడా గంజాయి దొరుకుతుంది. ఈ క్రమంలో కోదాడలో గత ఏడాదిగా గంజాయికి బానిసైన కొడుకును దారిలోకి తెచ్చేందుకు ఓ తల్లి కఠినంగా వ్యవహరించింది.

వివరాల్లోకి వెళ్తే..

కోదాడలోని గాంధీనగరానికి చెందిన రమణ దంపతులు కూలిపని చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగుతుంటారు. అయితే వారి కుమారుడు సురేష్ (15) మాత్రం గత ఏడాదిగా గంజాయికి బానిసై ఏ పనిచేయకుండా తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో కొడుకును దారిలోకి తీసుకొచ్చేందుకు , గంజాయి ని మానేలా చేసేందుకు కఠిన శిక్ష విధించింది. కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసి , కళ్లల్లో కారం పెట్టింది. ఇంకొసారి గంజాయి జోలికి వెళ్తావా అంటూ కొడుకును చితక్కొట్టింది.
కొడుకు కళ్లల్లో ఇలా కారం పోయాల్సి వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదని వాపోయింది. గంజాయి తాగి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోవటంతో భరించలేకపోయానని ఆ తల్లి చెప్పుకొచ్చింది.