శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకునిగా రమణ దీక్షితులు బాధ్యతల స్వీకారం

తితిదే సంచలన నిర్ణయంతో విధుల్లో చేరిక

Ramana deekshitulu took charge as the Chief Priest
Ramana deekshitulu took charge as the Chief Priest

Tirumala: తితిదే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకునిగా ఏవీ రమణ దీక్షితులు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇదిలావుండగా , ప్రస్తుతం గొల్లపల్లి వంశం నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతూ వచ్చారు. వేణుగోపాల్ దీక్షితులు పర్మినెంట్ ఉద్యోగి కావడం వలన అధికార బదలాయింపులో ఎలాంటి మార్పులు వుండవని అధికారులు చెబుతున్నారు.

శ్రీవారి ఆలయంలో మూడేళ్ల క్రితం రిటైర్ అయిన అర్చకులు తిరిగి విధుల్లో చేరవచ్చంటూ తితిదే సంచలన నిర్ణయం తీసుకుంది. రెండున్నరేళ్ల కిందట హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు మేల్కొని శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేయటం విశేషం. .తాజా నిర్ణయంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుని గా రమణదీక్షితులు తిరిగి విధుల్లో చేరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/