తక్కువ జీతానికి ఎక్కువ పనిగంటలు!

lower salary

న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఒక వింత పరిస్థితి ఎదురవుతోంది. సాధారణం కంటే అధిక పనిగంటలు పనిచేయాలని కంపెనీలు అడుగుతున్నాయి. అదే సమయంలో వారికి అప్పటికే వస్తున్న వేతనం కంటే తక్కుకే పనిచేయాలని కూడా కోరుతున్నాయి. ఎక్కువ అనుభవం ఉన్న వారికి అసలు ఉద్యోగాలు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నాయి.

ఒకప్పుడు రోజుకు 8 గంటలు పనిచేస్తే సరిపోయేది. అందులోనే ఒక గంట లంచ్‌బ్రేక్‌, రెండు టీ బ్రేకులు ఉండేవి. ఇండియన్‌ టైమింగ్‌ ప్రకారం కనీసం 30 నిమిషాలు ఆలస్యంగా రావడం, మరో 30 నిమిషాలు ముందే వెళ్లిపోవడం సహజంగా జరిగిది. బయో మెట్రిక్‌ అటెండన్స్‌ విధానం వల్ల కచ్చితంగా నిర్దేశిత సమయం వరకు ఉండాల్సిందే. ఇంకా ఏమైనా పని మిగిలిపోతే, అది పూర్తి చేయకుండా టీం లీడర్‌ ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్‌ ఇవ్వటం లేదు.

అంటే సుమారు 10 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఉదయం ఒకగంట, సాయంత్రం ఒక గంట ప్రయాణ సమయాన్ని కలుపుకుంటే మొత్తం 12 గంటలు ఉద్యోగ జీవితానికే సరిపోతోంది. ఇలా ఉండగా, ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్‌ కంపెనీ అలీబాబా ఫౌండర్‌, చైనా అపర కుబేరుడు జాక్‌ మా అయితే ఏకంగా 996పని విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. అంటే రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు, వారికి 6 రోజులు పనిచేయాలన్నది ఆయన ఉద్దేశ్యం.

అంటే ప్రస్తుత అధికారిక పనిగంటల కంటే 50శాతం ఎక్కువ పనిఅవుతుంది. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సేవింగ్స్‌ అకౌంట్లలో పొదుపు చేసుకునే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఇవి అమెరికాలో 1.7శాతం నుంచి 1.8శాతం ఉండగా, లండన్‌లోనూ సుమారు అదే స్థాయి వడ్డీరేట్లు ఉన్నాయి. ఇకపోతే జపాన్‌లో అయితే కేవలం 0.3శాతం మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. జర్మనీలో అయితే 5,00,000 యూరోల కంటే అధికంగా ఒకే ఖాతాలో పొదుపు చేస్తే 0.5శాతం నుంచి 0.75శాతం వడ్డీని బాదుతున్నారు.

అంటే మన డబ్బులను దాచుకున్నందుకు మనమే దానికి వడ్డీ చెల్లించే రోజులు వస్తున్నా యి. ఈ విషయంలో మన భారత దేశం కొంత నయమే అయినా, గత పదేళ్లలో మన దేశంలో కూడా వడ్డీరేట్లు సగానికి సగం పడిపోయిన విషయాన్నీ గుర్తించి ఉండాలి. 2008-10 సమయంలో పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లు దాదాపు 10 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం అవి 6శాతానికి పడిపోయాయి. మరో పదేళ్లలో 3శాతానికి పరిమితం అవుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జాబ్‌ మార్కెట్‌ కూడా చాలా వేగంగా మారిపోతోంది.

మన దగ్గర నుంచి ఎవరైనా అమెరికానో మరో దేశమో వెళ్లినప్పుడు అక్కడ పార్ట్‌ టైం జాబ్స్‌ చేస్తుంటాం అని చెబుతుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే కల్చర్‌ ఇండియాలో కూడా మొదలైంది. మెట్రో నగరాల్లో ఉండేవారికి ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు అందే ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ లోనూ, ఇతర రంగాల్లోనూ కాంట్రాక్టు కల్చర్‌ అధికంగా ఉంది. లేదా పార్ట్‌టైం జాబ్స్‌ ఆఫర్‌ చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. కొందరైతే స్విగ్గి, జొమాటో, ఉబెర్‌, ఓలా, రాపిడో, ఉబెర్‌ మోటో వంటి నయా ఆప్‌ల్లో నమోదు చేసుకుని, రోజులో 3-4గంటలు పార్ట్‌టైం పనిచేస్తున్నారు.

యూట్యూబ్‌ ఛానెల్స్‌లో కూడా పార్ట్‌టైం జాబ్స్‌ లభిస్తున్నాయి. అలా వచ్చిన సొమ్ముని ఖర్చులకు వినియోగించి, నెల జీతం సేవింగ్స్‌ కోసం, పెట్టుబడుల కోసం, షాపింగ్‌ వగైరాలపై వెచ్చిస్తున్నారు. మనం ఊహించన రంగాల్లో కూడా కాంట్రాక్టు జాబ్స్‌,పార్ట్‌టైం జాబ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒక ఉద్యోగిని అవసరం ఉన్నంత వరకే వేతనమిచ్చి, తర్వాత గుడ్‌ బై చెప్పే కల్చర్‌ కూడా ఎక్కువైంది.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/